అల్లర్లు సృష్టించే కుట్ర
ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లో అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 8 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతల కారణంగా అలజడి రేగుతోందన్నారు. బీజేపీ ముస్లింలను ద్వేషిస్తోందని ఆరోపించారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని మత ఘర్షణల పేరిట అల్లకల్లోలంగా మార్చేసి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

