NewsTelangana

త్వరలో పార్ట్‌-2 వీడియో అప్‌లోడ్‌

ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో డబీర్‌ పురా పీఎస్‌లో కేసు నమోదు చేశారు.. దీనిలో భాగంగా పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో కూడా  రాజాసింగ్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదవుతున్న కేసులపై రాజాసింగ్‌ స్పందించారు. మునావర్‌ హైదరాబాద్‌ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముందే హెచ్చరించానని అయినా మునావర్‌తో షో జరిపించారన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి భద్రత ఎలా కల్పిస్తారంటూ రాజాసింగ్‌ ప్రశ్నించారు. తన కౌంటర్‌ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారన్నారు. రెండో భాగం వీడియో త్వరలో అప్‌లోడ్‌ చేస్తానని, తనపై ఎలాంటి చర్యలకు దిగినా తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.