తమిళ దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష
ఓ చెక్‌బౌన్స్ కేసులో తమిళ దర్శకుడు లింగుస్వామికి ఆరు నెలలు జైలు శిక్షపడింది. ” యెన్ని ఏడు నాల్ ” చిత్రానికి సంబంధించి రూ. 1.03 కోట్ల చెక్కుబౌన్స్ కావడంతో లింగుస్వావిపై ఇటీవల కేసు నమోదైంది. దీనిపై పూర్తి విచారణ చేసిన తర్వాత కోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించాలని తీర్పుని ఇచ్చింది. కొన్ని ఏళ్ల క్రితం పీవీపీ సినిమాస్ నిర్మాణ సంస్థ నుండి లింగుస్వామి ఆయన సోదరుడు సుబాష్ అప్పు తీసుకున్నారు. దీనిని చెల్లించే క్రమంలో పీవీపీ ఫైనాన్స్ కంపెనీకి డబ్బును చెక్కుల రూపంలో ఇచ్చారు. కానీ ఆ చెక్కులు బౌన్స్ కావడంతో , పీవీపీ సంస్థ అతనిపై కేసు వేసింది. ఈ కేసులో భాగంగా చెన్నైలోని సైదా పేట్ కోర్టు తీర్పు వెలువరించింది. అతనితో పాటు తన తమ్ముడు సుభాష్ చంద్రబోస్‌కు కూడా 6 నెలలు జైలు శిక్ష విధించినట్టు కోర్టు పేర్కొంది.

లింగుస్వామి అంటే తెసియని వారుండరు. కమర్షియల్ చిత్రాలను తీయడంలో ఆయనకు సాటి లేరనే చెప్పోచ్చు. తమిళ సినిమాలే కాకుండా తెలుగు సినిమాలలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా హీరో రామ్‌తో ఆయన తెరకెక్కించిన చిత్రం ” ది వారియర్ ” బక్సాఫీస్లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోసిందనే చెప్పాలి. ఆయన దర్శకుడిగా మాత్రమే కాక తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై కొన్ని సినిమాలను నిర్మించగా , వాటి పై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి.

