NewsNews AlertTelangana

అనవసర హారన్‌పై ఫైన్

రోడ్డు పై వెళ్లెటప్పుడు హారన్ అనేది చాలా ముఖ్యం. ప్రమాద పరిస్థితులలో ఇది ఎంతో అవసరం. అయితే హారన్‌ను అత్యవలరమైన సమయంలో తప్ప , అనవసర సందర్భాల్లో ఉపయోగించడాన్ని నిషేదించినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. అలా అనవసరంగా హారన్ మోగిస్తే ఫైన్స్ కట్టక తప్పదని హెచ్చరించారు. రోడ్లపై అనవసరంగా హారన్ కొడుతూ ఇతర వాహనదారులని ఇబ్బంది పెడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

మోటర్ వెహికిల్ రెగ్యులేషన్ 2017 23(2)  ప్రకారం..  “ రెండు వెేర్వేరు వాహనాలు ప్రమాద సమయంలో ఉన్నాయని తెలిసినప్పుడు మాత్రమే హారన్ వినియోగించాలని ” ట్విీట్ చేశారు. అయితే ఈ నిబంధన పై ఎంత ఫైన్ వేస్తారో అనేది తెలియాల్సి ఉంది.