NewsTelangana

జగదీశ్‌ రెడ్డి అధ్యక్షతన సీఎం సభ ప్రారంభం

ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ గులాబీ జెండా ఎగురవేశారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్‌ మునుగోడుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకగా… అభివాదం చేస్తూ సభ వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సభకు మంత్రి జగదీశ్‌ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ… మునుగోడులో ఫ్లోరైడ్‌ రక్కసిని సీఎం కేసీఆర్‌ దార్శనికతతో పారద్రోలాడన్నారు. 2002లో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఈ ప్రాంతంలో ఊరూరా తిరిగారు. నాటి దీనస్థితిని ఆయన కళ్లారా చూశారు. ఫ్లోరైడ్‌ భూతం దేవుడిచ్చిన శాపం కాదు..గత పాలకులు ఇచ్చిన పాపం అని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫైర్ అయ్యారు.