తెలంగాణాలో రానున్న పవర్ కష్టాలు
తెలంగాణా ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలవబోతున్నాయా.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజలు వరకూ కరెంటు కష్టాలు తప్పేలా లేవని విద్యుత్ శాఖ అధికారులు సైతం ధృవీకరించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. దీనితో ఇంధన ఎక్సేంజిలో బకాయిలు చెల్లించని కొన్ని రాష్ట్రాలపై కేంద్రం కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించింది. తెలంగాణా డిస్కంలు ఆగస్టు 18 నాటికి 52.85 కోట్లు చెల్లించవలసి ఉందని కేంద్రం తెలిపింది. ఈ సొమ్ము చెల్లిస్తేనే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతి లభిస్తుంది. దీనిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నామని, రానున్న రెండురోజుల్లో కరెంటు సరఫరాలో అంతరాయాలు ఉండవచ్చని, ప్రజలు, రైతులు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు కోరుతున్నారు.