తేలు విషం లీటర్ రూ. 80 కోట్లు
తేలును చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీని కాటు వలన ఒక్కోసారి మనుషులు ప్రాణాలు కొల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇవి దాదాపు 2000 జాతులున్నాయి. విచిత్రమైన ఆకారమే కాదు.. జీవన విధానం కూడా విచిత్రంగా ఉంటుంది ఎటువంటి వాతవరణంలోనైనా జీవించే తేలు.. ఏడాదికి ఒకసారి తిన్నా కూడా జీవిస్తాయి. తినడానికి ఆహారం దొరక్క పొతే జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. తేలు కరిచినప్పుడు ఆ విషం, శరీరంలోని నర్వస్ సిస్టం మీద పడుతుంది. దాంతో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశముంది.

ప్రాణాలు తీసే ఈ తేలు విషంతో పలు వ్యాధులకు మందులు కూడా తయారు చేస్తున్నారు. అందుకే ఈ విషం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషంగా గుర్తింపు పొందింది. తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. అందుకనే తేలు విషానికి అత్యంత డిమాండ్. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం 80వేల వరకు విక్రయిస్తారు. అంటే లీటర్ తేలు విషం లీటర్ ధర రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా గుర్తింపు పొందింది. దీంతో టర్కీ దేశంలో తేళ్లను ల్యాబ్స్ లో పెట్టి మరీ పెంచుతున్నారు.

టర్కీలోని ఒక ల్యాబ్ లో రోజుకు తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషాన్ని సేకరిస్తున్నారు. తేళ్లను బాక్సుల నుండి బయటకు తీసి ప్రత్యేక పద్ధతుల్లో వాటి నుండి విషాన్ని సేకరిస్తారు. తర్వాత విషాన్ని గడ్డకట్టించి పొడి చేసి విక్రయిస్తారు. తేళ్లను పెంచుతున్న యజమాని మెటిన్ ఓరెన్లర్ మీడియాతో మాట్లాడుతూ..తేళ్ల నుంచి విషాన్ని సేకరించే విధానం గురించి వివరించాడు. తాము తేళ్లను పెంచి… వాటి నుంచి విషాన్ని సేకరిస్తున్నామని చెప్పాడు… అలా తేళ్ళ నుంచి సేకరించిన విషాన్ని ముందుగా గడ్డకట్టిస్తామని.. గడ్డకట్టిన విషాన్ని పౌడర్‌గా మార్చి ఐరోపాకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీలకు ఎగుమతి చేయబడిన తేలు విషాన్నికాస్మోటిక్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఒక తేలు దాదాపు 2 మిల్లీ గ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ల్యాబ్ ప్రతిరోజూ 2 గ్రాముల విషాన్ని సేకరిస్తామని మెటిన్ చెప్పారు. తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. దీంతో కీళ్లవాతాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది. వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) కీళ్ల నొప్పులు మొదలైన కొన్ని జబ్బులు తగ్గిపోయినట్లు గుర్తించారు.