Home Page Sliderhome page sliderTelangana

ఉద్యోగులకు సంక్రాంతి కానుక

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్ పెంపు ఫైల్‌పై ఆయన సోమవారం సంతకం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమాను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గత పాలకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 7.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లింది. మేము ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. యజ్ఞంలా మేము పనులు చేస్తుంటే ఫామ్‌హౌస్‌లో ఉన్న కొందరు ‘మారీచుల్లా’ అడ్డుపడుతున్నారు” అని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల