Breaking NewsHome Page Sliderhome page sliderNational

ప్రధాని పీఠంపై ‘హిందూ-హిజాబ్’ వార్

భారత తదుపరి ప్రధానమంత్రి ఎవరనే అంశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలన్న ఒవైసీ కలపై హిమంత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
ఈ వివాదంపై హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. “రాజ్యాంగపరంగా ఎవరైనా ప్రధాని కావచ్చు, దానికి అడ్డంకులు లేవు. కానీ, భారతదేశం ఒక హిందూ దేశం, ఇక్కడ ఉన్నది హిందూ నాగరికత. అందుకే భవిష్యత్తులో కూడా భారత ప్రధానిగా ఎప్పుడూ ఒక హిందువే ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం” అని తేల్చి చెప్పారు.హిమంత వ్యాఖ్యలపై నాగ్‌పూర్‌లో స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “అసోం సీఎం బుర్రలో ట్యూబ్‌లైట్ వెలుగుతోంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా సంకుచితంగా మాట్లాడటం సిగ్గుచేటు. మన రాజ్యాంగం ఏ ఒక్క మతానికో, వర్గానికో సొంతం కాదు. ఇది నాస్తికులకు కూడా సమాన హక్కులు కల్పిస్తుంది” అని మండిపడ్డారు. ఒవైసీ తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తుచేస్తూ, మతపరమైన పరిమితులు ఉండటానికి ఇది పాకిస్తాన్ కాదని , మన దేశ గొప్పతనమే భిన్నత్వమని ఒవైసీ అన్నారు . డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిమంత కంటే ఎంతో విజ్ఞానవంతుడని ,రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేకుండా హిమంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారని , అని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.