పారిశ్రామికవేత్తల కోసమే హిల్ట్ పాలసీ
తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకుండా , పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా హిల్ట్ పాలసీ రూపొందించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.“పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, రైతులకు వేరే విధానమా?” అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా అవినీతి జీవోను తీసుకొచ్చారని కూడా పేర్కొన్నారు.హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లకు అనుమతి ఇస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏమవుతుందో అని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ పాలసీ అమలు అవుతోందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

