Breaking Newshome page sliderHome Page SliderTelangana

ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ఏసీబీ దర్యాప్తు

ఫార్ములా ఈ కేసులో నిందితుడిగా పేర్కోన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఇండియన్ గవర్నమెంట్ ఏజన్సీ కి ఛీప్​ సెక్రటరీ రామకృష్ణరావు లేఖ రాశారు. ఈ కార్ రేస్ కేసులో యాంటి కరప్షన్ బ్యూరో ఇచ్చిన నివేదిక పై చర్యలు చెపట్టేందుకు సీఎస్ డివోపిటికి లేఖ రాశారు. డివోపిటి అనుమితి ఇచ్చిన నేపధ్యంలో సీఎస్ ఏసీబీకి ఆదేశాలు జారీ చేయనున్నారు.

కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ కూడా అనుమతి అందించారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సన్నద్ధమై ఉందని సమాచారం ఉంది. కేసులో ఏ1గా పేర్కొన్న కేటీఆర్, ఏ2గా పేర్కొన్న అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెండు సార్లు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.