Breaking Newshome page sliderHome Page SliderTelangana

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటలాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు . ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో సీఎం పర్యటించారు . ఈ సందర్భంగా డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటిని ప్రారంభించారు. యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిందని, గత 10 ఏళ్లలో ఈ జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారుని ఇంటికీ చేరేలా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కువ సంక్షేమ పథకాలు ఖమ్మం నుంచే ప్రారంభించామని గుర్తుచేసిన ఆయన, 1969లో జరిగిన మొదటి తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం నేల నుంచే పుట్టిందని, రాష్ట్ర సాధనకు మొదటి అడుగులు ఇక్కడే పడ్డాయని అన్నారు. మంచి మంత్రులు ఉంటే సరిపోదని, గ్రామ స్థాయిలో మంచి సర్పంచులు కూడా అవసరమని, అందుకే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మరొక పదేళ్లు ఏ ఆటంకం లేకుండా రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించాలంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.