మా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి
ఎంఎల్సీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు నేతలు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలంటూ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమపై ఎలాంటి ఒత్తిడి లేదా ప్రలోభాలు లేవని, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించుకున్నామని స్పష్టం చేశారు. రాజీనామాలను వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ ప్రశ్నించగా, అటువంటి ఉద్దేశం లేదని స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మోషేన్ రాజును కలిసిన నేతల్లో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు. రాజీనామాలపై మండలి కార్యాలయం త్వరలో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

