మైనర్ల ప్రేమ… గర్భం దాల్చిన బాలిక
వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వనపర్తి మండలానికి చెందిన 9వ తరగతి చదువుతున్న అబ్బాయి, ఇంటర్ చదువుతున్న బాలిక ప్రేమించుకున్నారు . పలుసార్లు శారీరకంగా కలిశారు . ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి కావడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇద్దరూ మైనర్లే కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గందరగోళానికి గురయ్యారు.ఈ నెల 14న బాలిక శిశువుకు జన్మనిచ్చింది. గ్రామంలో జరిగిన పంచాయతీలో బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో అసంతృప్తి చెందిన బాలిక కుటుంబ సభ్యులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, శిశువుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మండలంలో హాట్‌టాపిక్‌గా మారింది.

