Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కోనసీమ ‘దిష్టి’ వివాదంపై రాజకీయ తుపాను

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోనసీమలో చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు రాజకీయ రంగంలో కొత్త చర్చలకు దారితీశాయి. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు లో బుధవారం నిర్వహించిన ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్, కోనసీమ పచ్చదనం, కొబ్బరి చెట్ల ఎండిపోవడం వంటి అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.“పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నాయకులు ఈర్ష్య పడ్డారు. ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణం. నరుడు దిష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది… కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగింది.”
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సూర్యాపేటలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పవన్‌పై కఠినంగా స్పందించారు.
“కోనసీమకు తెలంగాణ దిష్టి తగలాలంటే అక్కడికి వచ్చి ఎవరు చూస్తున్నారు? అక్కడి వాళ్లే భారీగా హైదరాబాద్‌కి వస్తున్నారు… వాళ్లే మనపై దిష్టి పెడుతున్నారు. నోటికి అదుపు పెట్టుకోలేని వాళ్లు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారు.”“చేనులో దిష్టిబొమ్మలు పెడతారు… అలాగైతే కోనసీమలో కూడా పెడితే ఎవరు అడ్డుకుంటారు? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం ఆలోచించి మాట్లాడాలి,” అంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ వివాదం, కోనసీమ–తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాదారణ రైతుల సమస్యల నేపథ్యంలో జరిగిన కార్యక్రమం, ఇప్పుడు రాజకీయ వాగ్వాదాలకు వేదికైంది.