MLAల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
MLAల పార్టీ ఫిరాయింపుతో సంబంధం ఉన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలకంగా స్పందించింది. ధిక్కరణ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు జారీ చేస్తూ, మూడు నెలల గడువులో ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలని ఆదేశించింది. అలాగే, పెండింగ్‌లో ఉన్న విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
విచారణ సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కేసును పాస్ ఓవర్ చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించడంతో కేసు పాస్ ఓవర్ అయింది.
ఈరోజు సాయంత్రం మరోసారి విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

