45 వేల మెజారిటీతో గెలుస్తాను
ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబసమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే భారీ లీడ్ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో 45 వేల మెజారిటీతో గెలుస్తున్నానని ధైర్యంగా ప్రకటించారు.
తాజా లెక్కింపు ప్రకారం, ఆయన అంచనాల మేరకే 4 రౌండ్ల తర్వాత కూడా INC ముందంజలోనే కొనసాగుతోంది.

