ఎర్రకోట పేలుడులో మరణించింది డాక్టర్ ఉమర్ అని నిర్ధారణ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు నిర్ధారించాయి. ఈ వివరాలను INDIA TODAY వెల్లడించింది.
కారులో లభించిన డీఎన్ఏ నమూనాలు, ఉమర్ కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఉమర్ ఆత్మహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఉమర్ పేరిట నమోదు అయిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

