సిరియా అధ్యక్షుడితో ట్రంప్ చిట్ చాట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో రెండు దేశాల నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అల్ షరాకు ట్రంప్ ఓ పర్ఫ్యూమ్ బాటిల్‌ను అందిస్తూ..మంచి సువాసన ఇస్తుందని ఆయన తెలిపారు. మీకు, మీ సతీమణికి బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా ‘మీకు ఎంత మంది భార్యలు?’ అని సిరియా అధ్యక్షుడిని ట్రంప్ ప్రశ్నించారు. ఒక్కరే అని షరా బదులివ్వడంతో ‘అవునా ? నమ్మలేమా.’ అంటూ ట్రంప్ ఆశ్చర్యం వెలిబుచ్చడంతో అక్కడ నవ్వులు విరబూచాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా.. తొలిసారి అమెరికాను సందర్శించారు. 1946లో స్వాతంత్ర్యం తరువాత వాషింగ్టన్‌ను సందర్శించిన మొదటి సిరియా అధ్యక్షుడిగాను ఆయన రికార్డు సృష్టించారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన అధ్యక్షుడి హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడం ఆసక్తిగా మారింది. 2003లో ఇరాక్‌పై అమెరికా దండయాత్రకు ముందు అల్-ఖైదాలో చేరిన షరా.. ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్నారు. దీంతో అమెరికన్ దళాలు ఆయన్ను కొన్నేళ్లు (2006-11) నిర్బంధ కేంద్రంలో ఉంచాయి.
రెండు సిరియా చేరుకొని అల్-ఖైదా అనుబంధంగా.. ‘అల్ నుస్రా ఫ్రంట్’ను షరా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఇడ్లిబ్ లాంటి ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా ఎదిగారు. క్రమంగా అల్-ఖైదాకు దూరం జరిగారు. వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017 ప్రారంభంలో ‘హయాత్ తహరీర్ అల్-షమ్’(హెచ్‌టీఎస్)ను స్థాపించారు. గతేడాది డిసెంబరులో ఆయన నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం వైదోలగింది.

