home page slider

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ ఆరోపణలు తిప్పికొట్టిన పీసీసీ చీఫ్

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలను రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు.

‘రిగ్గింగ్ చేయడం అసాధ్యం. ఇది పాత జమానా కాదు. బీఆర్‌ఎస్ నాయకులు ఓటమి భయంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు.

‘హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ విషయాన్ని సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం’ అని మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.