Breaking NewsHome Page Sliderhome page sliderInternational

H-1B వీసా సంస్కరణలపై యూ-టర్న్‌ తీసుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: H-1B వీసా జారీలో చేసిన మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటమార్చారు. తమ దేశ పారిశ్రామిక, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ఆయన అంగీకరించారు.

జార్జియాలోని రక్షణ రంగ పరిశ్రమలో కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రంప్‌ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులు అమెరికా అభివృద్ధికి కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలి వరకు H-1B వీసాలపై పరిమితులు విధించిన ట్రంప్‌.. ఇప్పుడు ఆ విధానంపై సాఫ్ట్‌ స్టాన్స్‌ తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.