Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రి కందుల దుర్గేశ్ సూచనలు

నిడదవోలు: మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాల‌ని, పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

అదే విధంగా ఎర్ర కాలువ పరివాహక గ్రామాల్లోని రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వెల్లడించాల‌ని మంత్రి ఆదేశించారు.