పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక నేత కాసు మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తలొగ్గి, కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన అన్నారు.
మహేష్ రెడ్డి పేర్కొన్నట్లుగా, జాతీయ పాలసీ ప్రకారం మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి మంజూరయ్యాయి. ఆ పాలసీ ప్రకారం ప్రైవేటీకరణకు అవకాశం లేదని, అందువల్లే కేంద్రం రాష్ట్ర ప్రతిపాదనను తిరస్కరించిందని వివరించారు.
“ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని త్వరగా ప్రజల సేవలోకి తీసుకురావాలి,” అని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

