స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు
కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ ప్రమాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదులో ఎర్రిస్వామి తెలిపిన వివరాల ప్రకారం — “నేను, శివశంకర్ కలిసి మద్యం సేవించాం. అనంతరం బైక్‌పై బయలుదేరాం. డ్రైవింగ్ సమయంలో శివశంకర్ నిర్లక్ష్యంగా నడపడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరం కిందపడిపోయాం. ఈ ప్రమాదంలో శివశంకర్ స్పాట్‌లోనే చనిపోయాడు. నేను అతడి శవాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో మా బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ రోడ్డుమధ్యలో పడిపోయింది. అనంతరం వెనుకనుంచి వచ్చిన బస్సు బైక్‌ను లాక్కెళ్లింది,” అని పేర్కొన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివశంకర్‌పై నిర్లక్ష్య డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

