Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

రెండు రోజుల పాటు మెగా జాబ్ మేళా :ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ : నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో ఆయన నియోజకవర్గం హుజూర్‌ నగర్‌ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుకగల స్కూల్లో ఈనెల 25వ తేదీన ఈ మెగా జాబ్‌మేళా జరగనుంది. అయితే ఈ జాబ్ మేళాకు అనుహ్యాంగా 30 వేల పై చిలుకు నిరుద్యోగులు పేర్లు నమోదుచేసుకోవడంతో దీనిని రెండు రోజులకు పొడిగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. రెండో రోజు కొనసాగింపు విషయమై నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా అల్పాహారం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జాబ్ మేళాకు హుజుర్ నగర్ కు తరలి వస్తున్న నిరుద్యోగుల సౌకర్యార్థం ప్రతి ఆర్‌టిసి బస్ మేఘా జాబ్ మేళా సమీపంలో వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. జాబ్ మేళాకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఎక్కడా అసౌకర్యం కలుగ కుండా ఉండేలా వాలంటరీలతో క్రమ బద్దీకరించాలని, ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండో రోజు కొనసాగింపు విషయమై నిరుద్యోగులకు సమాచారం అందించేలా మూడు జిల్లాల కలెక్టర్లు,ఎస్.పి లు చర్యలు తీసుకోవాలని, తక్షణమే గ్రామ కార్యదర్శులను, గ్రామ పోలీస్ అధికారులతో సమాచారం చేర వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు,ఎస్.పి లకు సూచించారు.
ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అవుతాయని చెప్పారు. నిరుద్యోగులకోసం జాబ్‌ మేళా జరిగే చోట హెల్ప్‌డెస్క్‌తో పాటు ఆన్‌ లైన్ సేవలు అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్ లు ఏర్పాటు చేయలని అధికారులకు సూచించారు. టెన్త్ పాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా 18 నుంచి 40ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.