హలాల్ ఉత్పత్తులపై యోగి ఆదిత్యనాథ్ కఠిన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘హలాల్’ ఉత్పత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లవ్ జిహాద్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. “హలాల్ పేరుతో దాదాపు ₹25 వేల కోట్లు దుర్వినియోగం జరిగాయి. అందుకే హలాల్ వస్తువుల విక్రయాన్ని నిషేధించాల్సి వచ్చింది,” అని సీఎం తెలిపారు.
హలాల్ ఉత్పత్తులు అంటే ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా తయారు చేయబడిన వస్తువులకు ఇచ్చే సర్టిఫికెట్లు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కింది. ప్రతిపక్షాలు మాత్రం సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, “ఇలాంటి ఆరోపణలతో యోగి ఆదిత్యనాథ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు” అని విమర్శించాయి.