Home Page SliderLifestyleNewsviral

చేతిలోని స్మార్ట్ ఫోన్ వరమా? శాపమా?

ఇంటర్నెట్ డెస్క్ : మన అవసరాలు తీర్చడానికి వరంగా కనిపెట్టిన మన చేతిలోని స్మార్ట్ ఫోన్ శాపంగా మారకూడదంటే మన జీవన విధానంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలంటున్నారు సైకాలజిస్టులు. తమ వద్దకు వచ్చే అనేకమంది సమస్యలకు మూలకారణం స్మార్ట్ ఫోనే అంటున్నారు. వారి దృష్టిలో స్మార్ట్ ఫోన్ వినియోగానికి మూడు దశలు ఉన్నాయి.
.1 అవసరమైన పనులకే వాడడం
2 అవసరం లేకపోయినా గంటల తరబడి చూడడం, స్క్రోల్ చేయడం
3 చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళనగా ఉండడం. కోపంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, మనసంతా ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం.
ఇప్పుడు ప్రస్తుతం చాలామంది మూడవదశలో ఉన్నారని, దానివల్ల ఐదేళ్ల పిల్లల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకూ అనేక సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ ఫోన్ అలవాటు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నయి. ఫోన్ చేతిలో పెట్టేసి, పెద్దవారు పనులు చేసుకోవడం వల్ల పిల్లలు దానికి అడిక్షన్ అవుతున్నారు. ఫోన్ లేకుండా భోజనం కూడా చేయట్లేదు. ఇంట్లోని వారందరూ డైనింగ్ టేబుల్ ముందు కూడా గతంలో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవడం లేదు. యాంత్రికంగా ఎవరి ఫోన్ వారి చేతిలో పట్టుకుని భోజనాలు చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ మన జీవితాలలో శాపంగా మారకూడదంటే కొన్ని నియమాలు కఠినంగా పాటించాలని మానసిక వేత్తలు చెప్తున్నారు.
. చిన్న పిల్లలకు ముఖ్యంగా రెండేళ్ల లోపు పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు.
. వారంలో ఒక రోజు ఇంట్లోని అందరూ డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి.
. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్స్ లలో ఫోన్ తీసుకురాకూడదు.
ఈ విషయంలో తల్లిదండ్రులే ఫోన్ వాడకుండా రోల్ మోడల్స్ గా నిలవాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. పిల్లల అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు, వివాహ సంబంధాలుపై అధిక ఫోన్ వాడకం ప్రతికూల ప్రభావం చూపవచ్చు. నియంత్రిత, సమయపాలనతో ఫ్యామిలీ టైమ్‌ తో బ్యాలెన్స్ చేయడం అత్యంత అవసరం.