Breaking Newshome page sliderHome Page SliderNationalNews

ఈ బ్రాండ్స్ కొన్నవారు కుబేరులయినట్లే

ఇంటర్నెట్ డెస్క్ : 2018 లో సిరీస్ 3 సావరిన్ గోల్డ్ బ్రాండ్లకు సంబంధించి వాటి కాలపరిమితి 8 ఏళ్లు ముగియనుండడంతో ఫైనల్ రిడెంప్షన్ తేదీని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ ధరలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే అప్పుడు పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా 338 శాతం లాభాలు వచ్చాయి. దీనితో అప్పట్లో బంగారం బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు కుబేరులయినట్లే. 2017 – 2018 సంవత్సరానికి 2017 అక్టోబర్ 16న రిజర్వ్ బ్యాంక్ బాండ్లు రిలీజ్ చేసింది. అప్పట్లో గ్రాము బంగారం ధర రూ.2,866 మాత్రమే. 8 ఏళ్ల కాలం పూర్తి కావడంతో మెచ్యూరిటీకి వచ్చిన ఈ బాండ్ల విలువ ఇప్పుడు గ్రాముకి రూ.12,567గా నిర్ణయించారు. దీనితో ఒక గ్రాముపై ఏకంగా రూ.9700 పైగా లాభాలు వచ్చాయి. దేశంలో ఫిజికల్ బంగారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్ బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. ఇటీవల మూడు రోజుల సగటు ధరను ఆధారంగా చేసుకుని బాండ్లు రిడెంప్షన్ ధర నిర్ణయించారు. ఈ లాభాలపై పన్నులు కూడా లేకపోవడంతో మదుపర్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ బాండ్లు కొనాలనుకున్నవారికి బ్యాడ్ న్యూసే.. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీ తర్వాత కాలంలో ప్రభుత్వం నిలిపివేసింది. అప్పుడు కొన్న వారికి మాత్రం దీపావళి ముందు లాటరీ తగిలినట్లే.