కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు కేసీఆర్‌ను గెలిపించండి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే కేసీఆర్‌ను గెలిపించాలంటూ ప్రజలను పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధిని పక్కనబెట్టి, సీఎం రేవంత్ “కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని” విమర్శించారు.
అతను మాట్లాడుతూ — “గుడ్లు పీకి గోలిలాడుతా.. పేగులు మెడలేసుకుంటా అంటుండు. సిఎం బోటీ ఏమైనా అమ్ముతుందా?” అంటూ రేవంత్‌పై సెటైర్లు వేశారు.
“ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి – కారు కావాలా? బుల్డోజర్ కావాలో?” అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.