MB యూనివర్సిటీకి హైకోర్టు ఊరట – APSCHE ఆదేశాలపై స్టే
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో గుర్తింపు రద్దు చేసిన MB యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట లభించింది. ఈ యూనివర్సిటీపై ₹26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ సిఫార్సు చేస్తూ ఇటీవల APSCHE ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
దీనిపై వర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు APSCHE జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అదేవిధంగా, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలన్న నిర్ణయాన్ని కూడా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
అదనంగా, APSCHE సిఫార్సులను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తమ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని హైకోర్టు APSCHEకి ఆదేశాలు జారీ చేసింది.