Andhra PradeshBreaking NewsBusinesshome page sliderHome Page SliderNewsPoliticsviral

విశాఖలో ₹87,520 కోట్లతో డేటా సెంటర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 13న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఈ పర్యటనలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ (India) తో విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ₹87,520 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం.

ఇది అమెరికా వెలుపల నిర్మించబడుతున్న అతిపెద్ద డేటా సెంటర్గా భావిస్తున్నారు. ప్రాజెక్టు కోసం సుమారు 480 ఎకరాల భూమిలో మూడు క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షన్నర (1.5 లక్షల) ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.

ఇక, అక్టోబర్ 14న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడనున్నది. ఈ మేగా ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి కొత్త ఊపుని తీసుకురానున్నదని అధికారులు చెబుతున్నారు.