Breaking Newshome page sliderHome Page SliderTelangana

నేడే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా నోటిపికేషన్‍కు సంబధించి స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇందుకు నిరాకరించిన న్యాయస్థానం నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం నేడు యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం లీగల్ టీమ్‍తో చర్చిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ హైకోర్టులో నేడు జరగనుంది .