Home Page SliderInternationalNews

ఈ రంగాల్లో భారీ ఉద్యోగావకాశాలు

ఇంటర్నెట్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్ వేర్ రంగంలో లేఆఫ్స్ బాధలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ట్రావెల్, టూరిజం రంగంలో అలాంటి బాధల్లేవు. వచ్చే పదేళ్లలో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉద్యోగావకాశాలు ఉంటాయని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా వేసింది. ఫ్యూచర్ ఆఫ్ ది ట్రావెల్ అండ్ టూరిజం వర్క్‌ఫోర్స్ పేరుతో విడుదలైన ఈ నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
వచ్చే పదేళ్లలో ట్రావెల్, టూరిజం రంగంలో 4.3 కోట్లకు పైగా ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశముంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొత్త వర్క్‌ఫోర్స్ అవసరం, కనుక కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాల అవకాశాలు ఏర్పడతాయి. ఈ నివేదిక ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
నివేదిక ప్రకారం, 2035 నాటికి ట్రావెల్, టూరిజం రంగంలో పనిచేసే వ్యక్తుల అవసరాలు, డిమాండ్ మధ్య దాదాపు 4.3 కోట్ల మంది వ్యత్యాసం ఉండవచ్చు, అంటే ఎంతమంది వ్యక్తులు అవసరమో, అంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఈ రంగంలో అందుబాటులో ఉండరు. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం నేరుగా పడుతుంది. నివేదిక ప్రకారం.. చైనా, భారత్, యూరోపియన్ యూనియన్‌ లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు యూరప్ దేశాల జీడీపీలో ఎక్కువ భాగం పర్యాటకం నుంచే వస్తుందని తెలిసిందే. నేటికీ ప్రపంచ పర్యాటక రంగంలో యూరప్ అగ్రస్థానంలో ఉంది.
పలు రంగాలలో కొత్త టెక్నాలజీ వల్ల జాబ్స్ పోతున్నాయి. కానీ ట్రావెల్, పర్యాటక రంగాల్లో వర్క్‌ ఫోర్స్‌లో లోటు ఏర్పడుతుంది. కనుక ఈ రంగాల్లో వచ్చే పదేళ్లలో కోట్లాది కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాలి. కనుక యువత ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటే, భవిష్యత్తులో వారికి ట్రావెల్, టూరిజం రంగాల్లో కొత్త ఉపాధి మార్గాలు తెరుచుకుంటాయి.