Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు టీడీపీ దూరం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నాయకులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మద్దతు కోరితే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఎవరూ అడగకపోతే మొత్తం ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్ష సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ పట్ల సానుకూల దృక్పథం కొనసాగించాలని ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనా సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం .