Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

తిరుమలలో పీఏసీ-5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ5)ను తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో ఈ నూతన కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కల్యాణకట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా రెండు డైనింగ్‌ హాళ్లు ఉన్నాయి. వసతి గృహం బుకింగ్‌ కౌంటర్‌ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం దర్శించుకున్నారు. మరోపక్క శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం తిరుమలలో చిన్నశేష వాహనసేవ నిర్వహించారు. ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా భక్తులకు శ్రీనివాసుడు కనువిందు చేశాడు. గురువారం సాయంత్రం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు