Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTrending Todayviral

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పేర్ని నాని ఆగ్రహం

కృష్ణా జిల్లా మాజీ మంత్రి, వైసీ పీ సీనియర్‌ నేత పేర్ని నాని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన చేపట్టినా, 400 మందిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.మీడియాతో మాట్లాడిన ఆయన, “ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. అవసరమైతే నెలకాకపోతే రెండు నెలల జైలుకి పంపండి. కానీ, నిరసనకు అనుమతి ఇవ్వకపోవడం తగదు” అని వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వ విజయాలు గుర్తుచేసిన నాని 2014–19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం కాలేజీలను నడపలేమని ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యరంగానికి పెద్దపీట వేశారని వివరించారు. 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రతిపాదించి, అందులో ఐదు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్య అందించే దిశగా జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
లోకేష్‌పై తీవ్ర విమర్శలు “అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే ఇస్తామంటూ లోకేష్‌ నాయుడు మాటిచ్చాడు. కానీ ఇప్పుడు కాలేజీలను నడపలేనని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇదేనా మాట నిలబెట్టుకోవడం?” అని ప్రశ్నించారు.
పోలీసుల చర్యలపై ఆగ్రహం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిరసనకారులపై నమోదు చేసిన కేసులను తప్పుబడుతూ, “10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కొంతమంది స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు మాఫియాకు సహకరిస్తున్నారని, పేకాట కేంద్రాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. “మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బయటివారు డీజిల్‌ అమ్మితే అడ్డుకుంటున్నారు. నెలకు పది లారీలు అక్రమంగా అమ్ముతున్నారు” అని నాని ఆరోపించారు.