రాహుల్ కి కౌంటర్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
అధికార బీజేపీకి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అందుకు సంబంధించి తన దగ్గర ఆటమ్ బాంబు లాంటి సాక్ష్యం ఉందని కాంగ్రెస్ ఎంపీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ దగ్గర ఆటమ్ బాంబు ఉంటే పేల్చనిద్దామని, కానీ ఆ పేలుడులో ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలని రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. అధికార బీజేపీ కోసం ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతుందంటున్న రాహుల్‌గాంధీ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని రక్షణ మంత్రి హెచ్చరించారు. లేదంటే నిప్పుతో ఆడుకోవడమైనా ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ లో భూకంపం సృష్టించబోతున్నాడని గతంలో కూడా ఆయన మనుషులు హంగామా చేశారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు.