Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertPoliticsTrending Todayviral

జగన్ తో కరేడు రైతులు – చంద్రబాబుకు షాక్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డిని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కరేడు గ్రామానికి చెందిన రైతులు కలిశారు. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పచ్చని పంటపొలాలను బలవంతంగా తీసుకొవాలని చూస్తోందంటూ కరేడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ పోరాటానికి అండగా ఉంటామని, అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ రైతులకు రైతులకు ధైర్యం చెప్పి హామి ఇచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన ఉలవపాడు మండలం కరేడు గ్రామం ఉంది. సంవత్సరానికి రెండు పంటలు పండుతాయని రైతులు వాపోయారు.గత రెండు మూడు నెలలుగా ఈ భూములపై వివాదం కొనసాగుతుంది. రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించామని ,అధికారులు తమను ఓ ప్రైవేట్ కంపెనీకి భూములు ఇవ్వాల్సిందేనని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఈ భూములే జీవనాధారమని ,ఎట్టి పరిస్ధితుల్లో భూములు వదులుకునేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫోర్టు తీసుకువచ్చినా ఏటువంటి ఇబ్బందులు కాలేదని తెలిపారు. ప్రభుత్వంలోని కొందరి ప్రజాప్రతినిధుల వత్తిడితో ఈ భారీఎత్తున భూసేకరణ తలపెట్టారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరించారు. జివో ను వెనక్కి తీసుకోకపోతే కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు,పవన్ కల్యాణ్ కు రైతులు తడఖా ఎంటో చూపిస్తామని అల్టీమేటం ఇచ్చారు. రావూరు పంచాయితీలో రెండు వేల ఎకరాలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి కరేడు భూములపై కన్నేయడంలో కుట్ర దాగుందని కరేడు రైతులు మండిపడ్డారు.