BusinessHome Page SliderNationalNews

రైల్ సేవలన్నీ ఒకే యాప్ లో

రైల్వేకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. తొలుత స్వరైల్ (SwaRail) పేరిట ఈ సూపర్ యాప్ ను పరీక్షించిన రైల్వే శాఖ.. తాజాగా రైల్వన్(Rail one) పేరిట పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో రిజర్వ్/ అరిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్ఆర్, జర్నీ ప్లానింగ్, రైల్ మదద్, ఫుడ్ ఆన్ ట్రైన్ వంటి సేవలు పొందొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసూపర్ యాప్ ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ఆన్లైన్లో, యాప్ రూపంలో వేర్వేరుగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉంది. వీటన్నింటినీ ఒకేచోట అందించడమే ఈ సూపర్ యాప్ లక్ష్యం. దీన్ని కొన్ని నెలలుగా పరీక్షించిన రైల్వేశాఖ.. ఎట్టకేలకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మరిన్ని సేవలను ఇందులో జోడించే అవకాశం ఉంది. ఈ యాప్ ను అభివృద్ధి చేసిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లాంచ్ చేశారు.