Home Page Slidertelangana,

తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్ ధరలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్‌పాస్‌ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు సోమవారం (జూన్ 9) నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్‌ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్‌పాస్‌ ధర ఇప్పటి వరకు రూ. 1,150 ఉండగా, దీన్ని రూ. 1,400 కు పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధర రూ. 1,300 నుంచి రూ.1,600 కు పెంచారు. మెట్రో డీలక్స్‌ పాస్‌ ధర రూ. 1,450 నుంచి రూ. 1,800కు పెరిగింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాస్‌లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది.