పామాయిల్ కూలీలకు శుభవార్త
పామాయిల్ కూలీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఖమ్మం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన పామాయిల్ కూలీలు మంత్రి నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. పామాయిల్ గెలలు కోసేందుకు అవసరమైన ఫైబర్ హార్వెస్టర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్పందిస్తూ హార్టికల్చర్ శాఖ ద్వారా దరఖాస్తు చేస్తే 50 శాతం రాయితీపై గడలు (పామాయిల్ ఫైబర్ హార్వెస్టర్స్) అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పామాయిల్ కూలీలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.