Home Page Sliderhome page sliderTelangana

ఇప్పటికైనా ఆమె నిజాలు మాట్లాడింది..

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు కేంద్రబిందువైంది. పార్టీపై ఆమె అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో, ఆమె తీసుకునే తదుపరి నిర్ణయం పై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా కవిత నిజాలు మాట్లాడిందన్నారు. పార్టీలో ఉన్న ఆ దెయ్యాలు ఎవరో కూడా ఆమె చెప్పాలన్నారు. నాలుగు కారు టైర్ లు నాలుగు దిక్కుల పోతున్నాయి. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు అంటే ఇవ్వొచ్చు కానీ నలుగురు సీఎంలు ఎలా అవుతారు అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.