పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదు..
పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదు.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశమన్నారు ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌లో దాడులు చేయిస్తుందని ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ట్రైన్ పేలుళ్లు, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ముందు ఆత్మాహుతి దాడి, పుల్వామా, పఠాన్ కోట్ అటాక్స్ అన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చేసినవే అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహ్రెయిన్ ప్రతినిధులకు వివరించానని.. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్‌కు సహాయం చేయకూడదని బహ్రెయిన్ ప్రతినిధులతో కోరారని అసదుద్దీన్ తెలిపారు.

