Breaking NewsHome Page SliderInternational

రిపోర్టర్‌ను గెంటేసిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఒక పత్రికా విలేకరిపై మండిపడ్డారు. గెటవుట్ అంటూ గెంటేశారు. విషయమేమిటంటే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ట్రంప్‌ల మధ్య వైట్‌హౌస్‌లో భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్ దేశం విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చిన విషయాన్ని విలేకరి ప్రశ్నించారు. అంతే ట్రంప్‌కు పూనకం వచ్చినట్లు కోపంతో ఊగిపోయారు. దానికి, దీనికి ఏమిటి సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేం మాట్లాడుతున్నావు, తెలివితక్కువగా మాట్లాడతున్నావ్, గెటవుట్ అంటూ మండిపడ్డారు. ఖతార్ విమానం ఇవ్వడం చాలా గొప్ప విషయం అని, దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింసలపై ప్రపంచం దృష్టి మరల్చడానికే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు ..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.