Home Page Sliderhome page sliderTelangana

మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడి

పెళ్లి చేసుకుంటానని యువ వైద్యురాలిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. మహబూబాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ స్వామి 2023 లో అక్కడే మెడికోగా పని చేస్తున్న తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇష్టం లేని పెళ్లి జరిగిందని విడాకులు కూడా తీసుకున్నానని నమ్మించాడని ఫిర్యాదు పేర్కొంది. ఓ సదస్సులో పాల్గొనేందుకు స్వామి నగరానికి రాగా ఇద్దరం కలిసి బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ కు వెళితే అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డానని వివరించింది. స్వామి తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతను ఆరా తీయగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తేలింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు స్వామిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.