పోక్సో కేసులో కుమారుడు అరెస్టు.. విషం తాగిన తల్లి
పోక్సో కేసులో కొడుకుని అరెస్టు చేయడంతో తల్లి విషం తాగి అస్వస్థతకు గురైన సంఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారాజుపల్లెకు చెందిన విజయ్‌ను (22) 17 ఏళ్ల బాలికతో ప్రేమ వ్యవహారం కారణంగా పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోక్సో కేసులో అరెస్టు కుమారుడు విజయ్ అరెస్ట్ చేయడంతో అతడి తల్లి నాగరాణి, సోదరి రూప పోలీసులు ముందే విషం తాగడంతో ఠాణా వద్ద ఉద్రిక్తత నెలకొంది. అస్వస్థతకు గురైన తల్లికి పోలీసులు అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. రూపను మరి కొంతసేపటికి తమ వెంట బంధువులు తీసుకుని వెళ్లారు.