కాంగ్రెస్ ఎమ్మెల్సీపై జగిత్యాల ఎమ్మెల్యే గుస్సా
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్లు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మోస్ట్ సీనియర్, మోస్ట్ సీనియర్ అని గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన కంటే సీనియర్ నేతలు, ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు పార్టీలో ఎంతో మంది ఉన్నారు. జీవన్ రెడ్డి ఓడిపోయినన్ని సార్లు కాంగ్రెస్ లో ఎవరూ ఓడిపోలేదు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పోటీచేసి జీవన్ ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. జగిత్యాల గురించి కేవలం ఆయన ఒక్కడికే తెలిసినట్లు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

