Home Page Sliderhome page sliderTelangana

బస్టాండ్‌లోనే గంజాయి విక్రయం.. పట్టుబడ్డ కేటుగాడు..

ఆర్టీసీ బస్టాండ్‌లోనే గంజాయి విక్రయం చేస్తుండగా ఓ కేటుగాడు పట్టుబడ్డాడు. తెలంగాణ నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్‌లో 1.22 కిలోల గంజాయి ఓ వ్యక్తి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. బస్ స్టాండ్ ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయగా సంచిలో గంజాయితో దొరికాడు. గంజాయి రవాణా వెనక ముఠా ఉందోనన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.