కశ్మీర్ లో రాజ్ నాథ్ సింగ్ ..
కశ్మీర్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. చీనార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు కేంద్రమంత్రి వెళ్లారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతను సమీక్షించిన కేంద్ర మంత్రి భద్రతా బలగాలను కలిశారు. నిన్న అదంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని మోడీ సందర్శించారు. కేంద్రం భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది.

