అదంపూర్‌లో మోదీ..పాక్ ఫేక్ న్యూస్‌కు చెక్..
ప్రధాని మోదీ ఆదంపూర్‌లోని భారత్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి అక్కడి వాయుసేన అధికారులు, సైనికులతో భేటీ ఆయ్యారు. సైనికులతో మాట్లాడి, వారి ధైర్యం, దృఢ సంకల్పాల గురించి ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ చేశారు. అలాగే వారితో దిగిన ఫోటోలను షేర్ చేసి, పాకిస్తాన్ ఫేక్ న్యూస్‌లకు చెక్ పెట్టారు. వాయుసేన సిబ్బంది దేశ రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన టోపీపై త్రిశూల్ చిత్రం ధరించారు. అలాగే పాక్ చేసిన అబద్దాలను ఫోటోల ద్వారా నిరూపించారు. భారత ఎస్-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్ చేసిన ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఆ ఎయిర్ బేస్‌కు వెళ్లి ఎస్-400 ఫోటోలతో ఈ ప్రచారం అబద్దం అని తేల్చేశారు. భద్రతాబలగాలకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

